Message

WORLD TEACHERS DAY MESSAGE

ఉపాధ్యాయుల దృష్టి విశ్వ వ్యాప్తం కావాలి 

            అక్టోబర్ 5 ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం. 1994 నుండి ఈ వేడుక నిర్వహించబడుతోంది 1966 అక్టోబర్ 5 ప్యారిస్ లో యునెస్కో, ఐ.ఎల్.వో. నిర్వహించిన ప్రత్యేక సదస్సులో ఉపాధ్యాయుల భాద్యతలు హక్కులకు సంబంధించి ఒక తీర్మానాన్ని ఆమోదించి, దానిని అన్ని దేశాలు అమలు చెయ్యాలని చెప్పారు. ప్రపంచం లోని ఉపాధ్యాయుల కోసం తీర్మానం చేసిన దినాన్నే "ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవం " గా పాటించాలని 1994 లో నిర్నయించబడినది. ఈ నిర్ణయాన్ని ప్రతీ ఏటా UNESCO, ILO, UNDP, UNICEF, EI, సంస్థలు ప్యారిస్ లో నిర్వహించున్నాయి. ప్రభుత్వాలు, ఉపాధ్యాయ సంఘాలు తమ భాద్యతగా నిర్వచించాలని చెప్పడమైనది. అయినా మన దేశం లో ప్రభుత్వాలు ఈ బాధ్యతా ను పట్టించుకోవడం లేదు. కాని భారత పాఠశాలల ఉపాధ్యాయుల సమాఖ్య (STFI) అనుబంధ సంఘాలు ప్రపంచ ఉపాధ్యాయుల దినోత్సవంను నిర్వహించుచున్నాయి.
       ఈ సారి ఈ దినోత్సవం సందర్భంగా UNESCO తదితర సంస్థలు ఉమ్మడిగా ఇచ్చిన సందేశంలో "TAKE A STAND FOR TEACHERS"  పిలుపు ఇచ్చాయి. ఉపాధ్యాయుల పక్షాన నిలబడండి అని దీని సారాంశం. ఈ పిలుపును స్వీకరించి అమలుచెయ్యల్సింది ప్రభుత్వం, సంఘాలు. ఆ పని చేసే విధంగా ఉపాధ్యాయులు స్పందించాలి. అందు కోసం పని చేస్తున్న సంఘాలను బలపరచాలి.
       గత నెల సెప్టెంబర్ 18,19 తేదిలలో వెనిజుల రాజధాని కారాకస్ లో ప్రపంచ ఉపాధ్యా సంఘాల సమాఖ్య ( WFTI -FISE) మహాసభ జరిగింది. భారతదేశం నుండి ఏకైక  ప్రతినిధి ఎస్.టి.ఎఫ్.ఐ ప్రధాన కార్యదర్శి కే. రాజేంద్రన్  ఈ మహా సభలో పాల్గొన్నారు. ప్రపంచం అంతటా అన్ని దేశాలలోను పెట్టుబడిదారులు, సంపన్న  వర్గాల ప్రయోజనాల కోసం విద్యా రంగంలో పెరిగిపోతున్న ప్రైవేటీకరణ, ప్రభుత్వాల తప్పుడు విధానాల వలన ఉపాధ్యాయులు పరిస్థితి అస్తవ్యస్తంగా మారుతోంది. అందువలనే ఉపాధ్యాయ ఉద్యమాలు వెల్లువెత్తుతున్నాయి. గత ఐదారు సంవత్సరాల నుండి చాల దేశాలలో ముఖ్యంగా అబివృద్ది  చెందుతున్న దేశాలలో ఉపాధ్యాయులు పెదా ఎత్తున ఉద్యమాలు చేస్తున్నారు. 
        బల్గేరియా లో జీతాలు పెంచాలని, పని పరిస్థితులు బాగుండాలనే డిమాండు తో ఉపాధ్యాయులు దీఘకాలిక సమ్మెతో కిండర్ గార్డెన్ లు రెండు సంవత్సరాలు మూతబడ్డాయి. గ్వాటిమాల లో పాఠశాలల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా పాఠశాలల ఉపాధ్యాయుల గొప్ప సమ్మె చేసారు. నార్వే లో పెంచిన పనిగంటలకు వ్యతిరేకంగా  90 వేల మంది ఉపాధ్యాయుల సమ్మేచేసారు. మెక్సికోలో రెండు నెలల పైగా జరిగిన సమ్మె తీవ్రపరిణామాలకు దారి తీసింది. అది ఉద్యోగుల, కార్మికుల అందరి సమ్మె గా మారింది. నైజీరియా లో 50 వేల మంది రెండు నెలలు సమ్మె చేసారు. పోర్చుగల్ లో 1.40 లక్షల మంది ప్రాధమిక, హై స్కూల్  టీచర్లు తరచుగా సమ్మె చేస్తున్నారు. నేపాల్ లో రోజుల తరబడి ఉపాధ్యాయుల సమ్మె వలన 35వేల స్కూల్ లు మూతబడినవి. గ్రీస్ దేశంలో సమరశీల పోరాటాలు చేస్తున్న "పామే" నేతృత్వం లో ఉపాధ్యాయులు పెద్ద ఎత్తున సమ్మెలు చేస్తున్నారు. చికాగో టీచర్ లు గతనెల 10రోజులు సమ్మె చేసారు. గీని, హోండురాస్, చీలి  తదితర అనేక దేశాలలో ఉపాధ్యాయులు ఎడతెగని పోరాటాలు, సమ్మెలు, ప్రదర్శనలు చేస్తున్నారు.
       పెన్షన్ పధకం ఉండాలి, జీతాలు పెంచాలి, పని భారం తగ్గించాలి, ప్రైవేటీకరణ ఆపాలి, కాంట్రాక్టు పద్దతులు వద్దు అనే డిమాండ్ లతోనే ఈ పోరాటాలు జరుగుతున్నాయి. ఆయా దేశాలలో అమలు జరుగుతున్న ఉదారవాద ఆర్ధిక విధానాలు, ప్రపంచ బ్యాంకు ఆదేశాలతో ఉత్పన్నమవుతున్న సమస్యలపై ప్రతిఘటన ఉద్యమాలు అనివార్యం  అవుతున్నాయి. ప్రపంచ వ్యాప్తంగా జరుగుతున్న ఉద్యమాలను ఉపాధ్యాయులు గమనించాలి. మన్మోహన్ సింగ్ ప్రభుత్వం రెండో దశ సంస్కరణల అమలుకు తెగించి నందున మన దేశంలో నూ రోజుల తరబడి సమ్మెలు చేయవలసిన పరిస్థితి ముందుకొస్తుంది. 2013 ఫిబ్రవరి 20,21 తేదిలలో రెండు రోజుల సమ్మె చేయాలని కేంద్ర కార్మిక సంఘాలు, ఫెడరేషన్ లు ఇప్పటికే నిర్ణయించాయి.
       ప్రపంచ పరిణామాల నేపధ్యంలో ఎస్.టి.ఎఫ్.ఐ. కార్యవర్ఘం దేశంలోని ఉపాధ్యాయులకు ముఖ్యంగా మూడు నినాదాలు ఇచ్చింది. అవి 1. ప్రభుత్వ విద్యారంగాన్ని బలపరచాలి 2. ప్రైవేట్  విద్యారంగాన్ని నియంత్రించాలి. 3. ఉపాధ్యాయ వృత్తి ఔన్నత్యాన్ని నిలబెట్టాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పధకం ప్రకారం ప్రభుత్వ పాఠశాలలు, కళాశాలలను  దెబ్బతీస్తున్నాయి. ప్రైవేట్ కార్పోరేట్  స్కూళ్ళు , విదేశి విశ్వవిధ్యాలయాల తోనే నాణ్యమైన విద్య సాధ్యమవుతుందని, వాటిని చూసి ప్రభుత్వ ఉపాధ్యాయులు నేర్చుకోవాలనే  పాఠాలు ప్రభుత్వ నేతలే వల్లెవేస్తున్నారు. విద్యకు కేటాయిస్తున్న నిధులలో ఏదో ఒక పేరుతో ప్రైవేటు విద్యా వ్యాపారులకు కట్టబెడుతున్నారు.  పాఠ్య పుస్తకాలు, మధ్యాహ్నభోజనం, వసతులు చివరికి ఉపాధ్యాయులకు ట్రైనింగ్ తో సహా అన్ని విషయాలలోనూ ప్రైవేటు సంస్థలకు అవకాసం ఇస్తున్నారు. ప్రైవేటు స్కూల్ లలో 25% ఫీజులు ప్రభుత్వం రీంబర్స్ చేయటం బలహీన వర్ఘాల వారికి నాణ్యమైన విద్య పేరుతో కార్పోరేట్ కాలేజీ లలో ప్రభుత్వమే ఫీజులు చెల్లించడం, పి.పి.పి తో మోడల్ స్కూల్ లను ప్రవేశ పెట్టడం వంటి చర్యలు ప్రభుత్వ  పాఠశాలలకు గొడ్డలి పెట్టుగా పరిణమించాయి. ఆధునిక విద్య ను ప్రభుత్వ పాఠశాలలు అందించలేకపోతున్నాయనే అసంతృప్తి తో తల్లితండ్రులు ప్రభుత్వ ప్రైవేటీకరణ  విధానాలనే సమర్ధిస్తున్నారు. ఇలాంటి సంక్లిష్ట పరిస్థితిని ఉపాధ్యాయులు సరిగా అర్ధం చేసుకుని, సముచిత ఉద్యమాలకు సన్నద్ధం  కావాలి. ప్రజలు తల్లితండ్రుల అబిప్రాయాలకు అనుగుణంగా నాణ్యమైన విద్యా బోధనకు, ప్రభుత్వ విద్యా వినాశకర విధానాల ప్రతిఘటనకు సమాయత్తం కావాలి. ఉపాధ్యాయుల స్వయంకృషి, ఉపాధ్యాయ సంఘాల ఉద్యమాలతో ఈ పరిస్థితిని ఎదుర్కోవాలి.  
"నాణ్యమైన విద్యకై నాణ్యమైన ఉపాధ్యాయులుగా ఎదగాలిఅనే ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (UTF) పిలుపును అమలు చేయడం ద్వారా ఉపాధ్యాయుల వృత్తి ఔన్నత్యాన్ని నిలబెట్టగలము .

No comments:

Post a Comment